సోమవారం 30 నవంబర్ 2020
Yadadri - Jul 30, 2020 , 00:04:39

కరోనా నివారణకు ప్రత్యేక యాగం

కరోనా నివారణకు ప్రత్యేక యాగం

భువనగిరి అర్బన్‌: పట్టణ పరిధిలోని శబరినగర్‌లోని శ్రీహరిహరపుత్ర అయ్యప్పస్వామి దేవాలయం ప్రాంగణంలో కరోనా నివారణకు బ్రహ్మశ్రీ కొడకండ్ల శ్రీరామశరణ్‌శర్మ గురూజీ ఆధ్వర్యంలో బుధవారం గణపతి విశేష పూజ, అఖండదీప స్థాపన, ఆలయ మూల విరాట్‌లకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, అష్టలక్ష్మి దేవతలు, విష్ణుమూర్తి సహిత ఆహ్వానం, దృష్ట మహాలక్ష్మి, సుదర్శనయాగ సహిత అమృత సంజీవనీ ధన్వంతర యాగం, శ్రీచక్ర సర్వతోభద్ర, లింగతోభద్ర, చతుశష్ఠ, మహశక్తిన్యాస పూర్వక అభిషేక కుంకుమార్చన చేశారు. మొత్తం 54హోమగుండాలు ఏర్పాటు చేసి 60 మంది వేద బ్రాహ్మణోత్తములచే యాగం నిర్వహించారు. అదే విధంగా విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి దేవాలయం ప్రాంగణంలో అదృష్ట మహాలక్ష్మి సుదర్శన సహిత, అమృత సంజీవని ధన్వంతరి మహాయాగం బ్రహ్మ శ్రీరామశర్మ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ బెలిదె వెంకటేశ్‌, అధ్యక్షుడు పసుపునూరి నాగభూషణం, దిడ్డి సత్యం, శ్యాంసుందర్‌ఘఠాని, బెల్లి దయాకర్‌, గాదె శ్రీనివాస్‌, నూనె వెంకటేశ్వర్లు, రవీందర్‌, వీహెచ్‌పీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌, ధనుంజయశాస్త్రి  పాల్గొన్నారు.