గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 30, 2020 , 00:04:41

ఎరువులు ఫుల్‌

ఎరువులు ఫుల్‌

  • వానకాలం సీజన్‌లో రైతులు ఇబ్బందులు పడకుండా తెలంగాణ సర్కారు చర్యలు
  • l అందుబాటులో 6,390 మెట్రిక్‌ టన్నుల యూరియా
  • l ఇప్పటి వరకు 457 మెట్రిక్‌ టన్నుల ఎరువులు విక్రయం 
  • l అదనంగా 6,390 మెట్రిక్‌ టన్నుల యూరియా స్టాకు
  • l 129 పీఏసీఎస్‌, ప్రైవేట్‌ ఫర్టిలైజర్స్‌ దుకాణాల ద్వారా విక్రయం
  • l సంతోషం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

ఒకప్పుడు ఎరువులు.. యూరియా కోసం రైతులు చెప్పులరిగేలా తిరిగేవారు. గంటల తరబడి క్యూలో ఉండలేక.. క్యూలైన్‌లో చెప్పులను సైతం ఉంచే పరిస్థితి. ఇదే అదనుగా వ్యాపారులు సైతం ఎక్కువ ధరలకు ఎరువులను విక్రయించేవారు. కాంప్లెక్స్‌ ఎరువులు కొంటేనే యూరియా బస్తా ఇస్తామంటూ మెలిక పెట్టేవారు. దీంతో అవసరం లేకున్నా రైతులు కాంప్లెక్స్‌ ఎరువులు కొనుగోలు చేసి నష్టపోవాల్సి వచ్చేది. 

తెలంగాణ ప్రభుత్వంలో ఆ పరిస్థితులన్నీ కనుమరుగయ్యాయి. వానకాలం సాగుకు ముందే రైతులకు సరిపడా ఎరువులను అందించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ధరల నియంత్రణపై పటిష్ట నిఘా పెట్టింది.  

జిల్లాలో  3,84,617 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేయగా.. 2.31 లక్షల ఎకరాల్లో పంటలు వేయడం పూర్తిచేశారు. ఇప్పటి వరకు 457 మెట్రిక్‌ టన్నుల ఎరువులను రైతులు కొనుగోలు చేశారు. పీఏసీఎస్‌, ఫర్టిలైజర్స్‌ దుకాణాల్లో ఇంకా 6,390 మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. ఎలాంటి కొరత లేకుండా ముందస్తుగానే ఎరువులను అందుబాటులో ఉంచడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు. 

- యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఒకప్పుడు ఎరువులు.. యూరియా కోసం రైతన్నలు చెప్పులరిగేలా తిరిగేవారు. గంటల తరబడి నిల్చోలేక.. క్యూలైన్లో చెప్పులను సైతం ఉంచే పరిస్థితి ఉండేది. ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు సైతం ఎక్కువ ధరలకు ఎరువులను విక్రయించేవారు. కాంప్లెక్స్‌ ఎరువులు కొంటేనే యూరియా బస్తా ఇస్తామంటూ మెలిక పెట్టేవారు. దీంతో అవసరం లేకున్నా రైతులు యూరియా కోసం కాంప్లెక్స్‌ ఎరువులను కొనుగోలు చేసి నష్టపోవాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వంలో ఆ పరిస్థితులన్నీ కనుమగయ్యాయి. వానకాలం సాగుకు ముందే రైతులకు సరిపడా ఎరువులను అందించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ధరల నియంత్రణపైనా పటిష్ట నిఘా ఉంచింది. జిల్లాలో అమలవుతున్న నియంత్రిత సాగు పద్ధతిలో వివిధ రకాల పంటలకు అవసరమైన ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచగా.. ఇప్పటివరకు 457 మెట్రిక్‌ టన్నుల ఎరువులను రైతులు కొనుగోలు చేశారు. ప్రస్తుతానికి ఇంకా 6,390 మెట్రిక్‌ టన్నుల యూరియా పీఏసీఎస్‌, ఫర్టిలైజర్స్‌ దుకాణాల్లో అందుబాటులో ఉన్నది. ఎలాంటి కొరత లేకుండా ముందస్తుగానే రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచడంతో రైతాంగం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.

జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి సైతం ఆశించిన మేరలో వరద నీరు వచ్చి చేరింది. బావులు, బోర్లలో కూడా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో రైతాంగం వానకాలం సాగును ఉత్సాహంగా చేపట్టింది. ఊహించిన దానికంటే అధిక మొత్తంలో పంటలు సాగయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 3,84,617 ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేయగా, ఇప్పటికే 2.31 ఎకరాల్లో పంటలను వేయడం పూర్తయ్యింది. 89,981 వరి సాగు, పత్తి 1,73,993 ఎకరాల్లో, 26,891 ఎకరాల్లో కంది, జొన్న 1,334 ఎకరాల్లో, పచ్చ జొన్న 396 ఎకరాల్లో, పెసర్లు 50 ఎకరాల్లో, మరో 52 ఎకరాల్లో పల్లి సాగుకు సంబంధించి విత్తనాలను విత్తడం కూడా పూర్తయ్యింది. మిగిలిన ఎకరాల్లోనూ పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. అన్ని రకాల పంటలకు సంబంధించి అవసరపడే రసాయన ఎరువులకు సంబంధించి జిల్లా వ్యవసాయ శాఖ సీజన్‌ ఆరంభానికి ముందే ప్రభుత్వానికి నివేదించింది. నియంత్రిత సాగు విధానాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రణాళిక మేరకు కావాల్సిన ఎరువులను వానకాలం సీజన్‌కు ముందే సంబంధిత అధికారులు అందుబాటులో ఉంచారు. 

6,390 మెట్రిక్‌ టన్నుల నిల్వలు..