సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jul 30, 2020 , 00:04:42

రైతులందరికీ పంట రుణాలు

రైతులందరికీ  పంట రుణాలు

  • టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి

రాజాపేట: రైతులందరికీ సహకార బ్యాంకు ద్వారా పంట  రుణాలు అందజేస్తామని టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులకు ఇప్పటి వరకు రూ. 90 కోట్ల రుణాలు  అందించామన్నారు. మరో రూ. 20 కోట్లు రైతాంగానికి పంట రుణాలు అందించేందుకు సిద్ధ్దంగా ఉన్నామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలేరు నియోజకవర్గంలోని 8 సొసైటీల్లో  రూ. 15 కోట్ల పెట్టుబడి రుణాలు అందించామన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్‌, సీసీ బ్యాంక్‌ చైర్మన్‌ చింతలపూరి భాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, మహిళాధ్యక్షురాలు బాలలక్ష్మి, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి,  మదర్‌డెయిరీ  డైరెక్టర్లు వెంకట్‌రాంరెడ్డి, గాల్‌రెడ్డి, భిక్షపతిగౌడ్‌, సర్పంచ్‌లు ఠాకూర్‌ ధర్మేందర్‌సింగ్‌, మధుసూదన్‌రెడ్డి, గోపిరెడ్డి, రాజు, మాజీ సర్పంచ్‌లు రామిండ్ల నరేందర్‌, వెంకటయ్య, నాయకులు  కృష్ణ, రాంరెడ్డి, కనకరాజు, సంతోష్‌గౌడ్‌,  యాదగిరి, స్వామి, జనార్దన్‌రెడ్డి, జశ్వంత్‌, సిద్ధులు, కరీం, కనకయ్య, మహేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo