గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 30, 2020 , 00:04:42

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

 పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

  •  ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి  

భువనగిరి అర్బన్‌:  పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని  ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి నిధులు, 14వ ఆర్థిక సంవత్సరం నిధులతో కొనుగోలు చేసిన చెత్త సేకరణ ఆటోలను  భువనగిరి మున్సిపల్‌ కార్యాలయంలో బుధవారం మున్సిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డుల్లో పరిశుభ్రతపై అధికారులు, ప్రజాప్రతినిధులు నిఘా పెంచాలన్నారు. సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా బ్లీచింగ్‌ పౌడర్‌ , సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించాలన్నారు. వార్డుల అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీని స్వచ్ఛమున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు.భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధిపై ఇప్పటికే ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కీమ్యానాయక్‌ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జడల అమరేందర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ వంశీకృష్ణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ డాక్టర్‌ నోముల పరమేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు గోమారి సుధాకర్‌రెడ్డి, చెన్న స్వాతీమహేశ్‌, తుమ్మల అనురాధ, దిడ్డికాడి భరత్‌, పంగరెక్క స్వామి, పొత్నాక్‌ ప్రమోద్‌కుమార్‌, జిట్టా వేణగోపాల్‌రెడ్డి, వడిచెర్ల లక్ష్మీకృష్ణయాదవ్‌, రత్నపురం బలరాం, పడిగెల రేణుక, అవంచకక్రాంతి, నాయకులు భాషబోయిన రాజేశ్‌, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు. 


VIDEOS

logo