శనివారం 06 మార్చి 2021
Yadadri - Jul 30, 2020 , 00:16:58

ఏఎన్‌ఎంలకు పీపీఈ కిట్ల పంపిణీ

ఏఎన్‌ఎంలకు పీపీఈ కిట్ల పంపిణీ

మోటకొండూర్‌ : గ్రామాల్లో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు మండల వ్యాప్తంగా ఉన్న అన్ని ఉపకేంద్రాల్లోని ఏఎన్‌ఎంకు పీపీఈ కిట్లు, థర్మోమీటర్‌ తదితర పరికరాలను బుధవారం మండల వైద్యాధికారి రాజేందర్‌నాయక్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వైద్య సిబ్బందికి రక్షణ కల్పించేందుకు అందజేస్తున్న రక్షణ సామగ్రిని సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా నిర్ధారణకు రాపిడ్‌ అంటిజెన్‌ పరీక్ష కిట్లు రాగా అందులో మోటకొండూర్‌ ప్రాథమిక ఆ రోగ్య కేంద్రం ఒకటి అన్నారు. మండలంలోని ప్ర జలు దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే కరోనా పరీక్షల నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది మహేశ్‌, ఏఎన్‌ఎం ధ నమ్మ, ఆశ వర్కర్‌ దేవరకొండ వాణి తదితరులు ఉన్నారు.

వైద్య సిబ్బందికి రక్షణ సామగ్రి అందజేత..

ఆత్మకూరు(ఎం) : కరోనా వైరస్‌ నివారణ కోసం వైద్య సిబ్బంది గ్రామాల్లో కరోనా పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం పంపిణీ చేసిన రక్షణ సామగ్రిని బుధవారం వైద్యాధికారి ప్రణీష మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం పంపిణీ చేసిన థర్మామీటర్‌, ఫల్స్‌ఆక్సీమీటర్‌, బ్లూకా మీటర్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయన్నారు. వైద్య సిబ్బంది రక్షణ సామగ్రిని గ్రామాల్లోకి వెళ్లినప్పుడు ఉపయోగించాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్‌వో కరుణాకర్‌, ఆరోగ్య కార్యకర్తలు మహేశ్వరి, ధనలక్ష్మి, ఎల్లమ్మ, విజయలక్ష్మి, సునీత పాల్గొన్నారు.

VIDEOS

logo