ప్రతి ఒక్కరూ జాబ్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి

ఆలేరు రూరల్ : ప్రతి ఒక్కరూ ఉపాధిహామీ పథకం జాబ్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్ బ్లాక్ రిసోర్స్ పర్సన్ శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండలంలోని కొలనుపాకలో జాబ్ కార్డు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఇతర ప్రాంతాలను వెళ్లిన వలస కూలీలు స్వగ్రామాలకు రావడంతో వారికి కూడా గ్రామాల్లో ఉపాధి కల్పించేందుకు జాబ్‌కార్డులు అందజేస్తున్నామన్నారు. అందుచేత వలస కూలీలందరూ జాబ్‌కార్డుకు దరఖాస్తు చేసుకొని ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తిరుపతిరెడ్డి, ఆడిట్ బృందం సభ్యులు అఖిల, రేష్మ తదితరులు ఉన్నారు.
పంటల సాగు పరిశీలన
వానకాలం పంటల సాగును ఏఈవో షాలిని క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. మండలంలోని గోలనుకొండలో రైతులు సాగు చేసిన పత్తి, పెసర పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంటలకు సోకిన పేనుబంక తెగుళ్ల నివారణకు ఎసిపేట్ను పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మహిళల కోసం నీతా అంబానీ ‘హర్సర్కిల్’!
- కరోనా వ్యాక్సినేషన్:మినిట్‌కు 5,900 సిరంజీల తయారీ!
- పాత వెహికల్స్ స్థానే కొత్త కార్లపై 5% రాయితీ: నితిన్ గడ్కరీ
- ముత్తూట్ మృతిపై డౌట్స్.. విషప్రయోగమా/కుట్ర కోణమా?!
- శ్రీశైలం.. మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం
- స్విస్ ఓపెన్ 2021: మారిన్ చేతిలో సింధు ఓటమి
- తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా
- భైంసాలో ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు
- గుత్తాకు అస్వస్థత.. మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ