గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 30, 2020 , 00:17:00

స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి

స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి

ఆలేరు రూరల్‌ : స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి చేయవచ్చని సర్పంచ్‌ ఆరుట్ల లక్ష్మీప్రసాద్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు మామిడాల అంజయ్య అన్నారు. బుధవారం మండలంలోని కొలనుపాకలో నాయీబ్రహ్మణులకు శానిటైజర్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోజురోజుకూ కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు ఆందోళన చెందకుండా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంగూల శ్రీనివాస్‌, మార్కెట్‌ క మిటీ డైరెక్టర్‌ మామిడాల నర్సింహులు, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ ఆరె మల్లేశ్‌, మాజీ సర్పంచ్‌ మల్లేశ్‌, టీఆర్‌ఎస్వీ మండలాధ్యక్షుడు మామిడాల భానుచందర్‌, బీసీసెల్‌ గ్రామశాఖ అధ్యక్షుడు మిట్టపల్లి పాండు ఉన్నారు.

హోమియోపతి మందులు పంపిణీ       

ఆలేరు : కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు స్వ చ్ఛంద సంస్థలు ప్రజలకు తమకు తోచిన సాయం చేస్తున్నాయి. బుధవారం యాదగిరిగుట్ట మం డలం మాసాయిపేటలో ప్రజలకు సేవా భారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ సభ్యులు వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి కావాల్సిన హోమియోపతి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వంటేరు సువర్ణాఇంద్రసేనారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు వంటేరు సురేశ్‌రెడ్డి, భాస్కర్‌, బాల్‌రెడ్డి, నర్సింహులు, మధు, సేవా భారతి సభ్యులు రాజేశ్‌, విక్రం, చందు, రాము, సంతోశ్‌, నరేందర్‌, గిరి, మత్స్యగిరి పాల్గొన్నారు.

మాస్కులు పంపిణీ

ఆత్మకూరు(ఎం) : కరోనా వైరస్‌ నివారణ కోసం తమవంతు సహకారాన్ని అందించేందుకు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలోని 1989వ సంవత్సరంలోని పదోతరగతి పూర్వ విద్యార్థులు బుధవారం 500ల మాస్కులు పంపిణీ చేశారు. దీంతో గ్రామ పంచాయతీ సిబ్బందికి మాస్కులతో పాటు గ్లౌసులు, కండ్ల అద్దాలు అందజేశారు. జర్నలిస్టులు, పోలీసులు, వైద్యులు, ఆటో డ్రైవర్లతో పాటు గ్రామస్తులకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ జన్నాయికోడె నగేశ్‌ మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థులు తమకు తోచిన సాయం అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ యాస కవితాఇంద్రారెడ్డి, ఉప సర్పంచ్‌ దొంతరబోయిన నవ్య, మాజీ సర్పంచ్‌ పూర్ణచందర్‌రాజు, లక్ష్మారెడ్డి, రామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ దశరథగౌడ్‌, పూర్వ విద్యార్థులు మతిన్‌, నగేశ్‌, రాము, సంతోశ్‌, లక్ష్మారెడ్డి, భాస్కర్‌, యాదగిరి, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo