ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 28, 2020 , 00:06:55

పంటల వివరాలు నమోదు చేసుకోవాలి

పంటల వివరాలు నమోదు చేసుకోవాలి

ఆత్మకూరు(ఎం) : ప్రతి రైతు తప్పనిసరిగా పంటలు, భూమి వివరాలను నమోదు చేసుకోవాలని ఏఈవో క్రాంతికుమార్‌ తెలిపారు. సోమవారం మండలంలోని కూరెళ్లలో పంటల వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సాగుచేసిన పంటల వివరాలతో పాటు భూమి సర్వేనంబర్లను ఈనెల 31వ తేదీలోపు వ్యవసాయ శాఖ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఉప్పలయ్య, రైతు బంధు సమితి గ్రామ కో-ఆర్డినేటర్‌ యశ్వంత్‌, రైతులు యాదిరెడ్డి, నర్సిరెడ్డి, భిక్షం, స్వామి, ముత్యాలు, అశోక్‌ పాల్గొన్నారు.

గడువులోపు నమోదు చేసుకోవాలి..

ఆలేరు రూరల్‌ : రైతులు తాము సాగు చేసిన పంట వివరాలను ఈనెల 31వ తేదీలోపు ఏఈవోల వద్ద నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి ఎస్‌.లావణ్య తెలిపారు. సోమవారం మండలంలోని తూర్పుగూడెంలో క్షేత్రస్థాయిలో పంటల వివరాల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు సాగు చేసిన పంటలు, భూమి సర్వే నంబర్‌, విస్తీర్ణం, నీటివసతి తదితర వివరాలను వ్యవసాయాధికారులకు తెలుపాలన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు షాలిని, నిశిత, సంధ్యారాణి, పవన్‌ ఉన్నారు.

VIDEOS

logo