బుధవారం 21 అక్టోబర్ 2020
Yadadri - Jul 28, 2020 , 00:06:57

‘కలాం’ సేవలు మరువలేనివి

‘కలాం’ సేవలు మరువలేనివి

యాదాద్రి, నమస్తే తెలంగాణ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం జీవితం యువతకు ఆదర్శనీయమని యాదగిరిగుట్ట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుధాహేమేందర్‌ అన్నారు. అబ్దుల్‌ కలాం ఐదో వర్ధంతి సందర్భంగా సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రపతి, శాస్త్రవేత్తగా కలాం అందించిన సేవలు మరువలేనివన్నారు. ఆయన రచనలు,  ఉపన్యాసాలు ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు, పార్టీ నాయకులు ఎ.హేమేందర్‌, అంకం నర్సింహ, గొర్ల భాస్కర్‌, సయ్యద్‌ బాబా, కేసరి బాలరాజు, వాసం బాలరాజు పాల్గొన్నారు.


logo