వ్యూహాత్మకంగా ముందడుగు

- సీపీఐతో టీఆర్ఎస్ అవగాహన
- ఎక్స్ అఫీషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలకు ఓటు
- ప్రతిపక్షానికి సంఖ్యాబలం కరువు
యాదాద్రి, నమస్తే తెలంగాణ : యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక టీఆర్ఎస్కు నల్లేరుమీద నడకే కానున్నది. సీపీఐతో వ్యూహాత్మక అవగాహన కుదుర్చుకొని పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోవడానికి పావులు కదిపింది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మొత్తం 12 మంది కౌన్సిలర్లు ఉండగా, వీరిలో ఐదుగురు టీఆర్ఎస్, నలుగురు కాంగ్రెస్, ఇద్దరు సీపీఐ, ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. గతంలో చైర్పర్సన్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటింగ్‌లో పాల్గొన్న ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, కడియం శ్రీహరిలకు కూడా ఇప్పుడు ఓటు వేసే అవకాశం ఉంటుంది. దీంతో పార్టీ బలపర్చిన అభ్యర్థులందరూ విజయం సాధించే అవకాశమున్నది. ప్రతిపక్ష పార్టీకి సరైన సంఖ్యాబలం లేకపోవడంతో వారి ఓటమి అనివార్యమే. మొత్తం 13 మంది అభ్యర్థులు పోటీలో నిలువగా టీఆర్ఎస్ బలపర్చిన గొర్ల పద్మ, సయ్యద్ బాబా, మహ్మద్ రిజ్వాన, సీపీఐ బలపర్చిన పేరబోయిన పెంటయ్యల విజయం దాదాపు ఖాయమే. దీంతో ఎన్నిక నామమాత్రం కానున్నది.
వ్యూహాత్మకంగా..
పట్టణంలో జరుగుతున్న విస్తృత అభివృద్ధి పనులు, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్యల చొరవతో టీఆర్ఎస్తో అవగాహన కుదుర్చుకోవడానికి సీపీఐ ముందుకు వచ్చింది. అలాగే యాదగిరిగుట్ట అభివృద్ధి కాంక్షిస్తూ సీపీఐ సీనియర్ నాయకులు గోద శ్రీరాములు, బబ్బూరి శ్రీధర్ మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వ, మున్సిపాలిటీ నిధులతో పాటు స్థానిక ఎమ్మెల్యే చేయూతతో మరింత అభివృద్ధి జరుగుతుందని భావించి వారు గులాబీ పార్టీతో అవగాహనకు మొగ్గు చూపారు.
29 ఎన్నిక..
యాదగిరిగుట్ట పురపాలక సంఘం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఈ నెల 29న జరుగనున్నదని మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత, చైర్పర్సన్ సుధాహేమేందర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11:30 గంటలకు జరిగే ఎన్నికకు కౌన్సిల్, ఎక్స్అఫీషియో సభ్యులు హాజరుకావాలని కోరారు.
నామినేషన్ దాఖలు
ఆలేరు టౌన్ : ఆలేరు మున్సిపల్ కో-ఆప్షన్ పదవికి ఒక్క నామినేషన్ దాఖలు చేశారని మున్సిపల్ కమిషనర్ హనుమంతప్రసాద్ సోమవారం తెలిపారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పట్టణానికి చెందిన ఎండీ సలీం నామినేషన్ దాఖలు చేశాడన్నారు. ఇప్పటివరకు నాలుగు పదవులకు ఒక్కరే నామినేషన్ వేశారని, మంగళవారం నామినేషన్లకు చివరిరోజు అన్నారు.
తాజావార్తలు
- సభ్యత్వ నమోదులో టీఆర్ఎస్దే ప్రథమ స్థానం
- ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్.. స్నేహితురాలి తండ్రి పనేనా.!
- విద్యార్థులు లక్ష్యాలను సాధించాలి
- వైరల్ వీడియో : ఆవు క్యాట్ వాక్
- ఆటోపైనే ఇళ్లు.. ఆనంద్ మహీంద్రా ఫిదా..!
- ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు
- సెంచరీతో సెలక్టర్లను ఆకర్శించిన దేవ్‌దత్
- దేవ్రీ ఆలయంలో పూజలు చేసిన ధోనీ
- సందీప్ కిషన్ నా ఫోన్ కాల్ ఎత్తాలంటే భయపడ్డాడు
- చిన్నారుల విద్యకు సోనూ సూద్‌తో చేతులు కలిపిన ఎంఐ మొబైల్స్