సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jul 28, 2020 , 00:07:39

కరోనాతో కంగారు పడొద్దు

కరోనాతో కంగారు పడొద్దు

  • l రోగనిరోధకశక్తిని పెంచే  ఆహారం తీసుకోవాలి
  • l యోగా, వ్యాయామం  తప్పనిసరి  
  • l స్వీయ నియంత్రణతోనే వైరస్‌ కట్టడి 
  • l భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి 
  • l కరోనా బాధితులకు నిత్యావసరాలు అందజేత 

అడ్డగూడూరు: మండలంలోని చిర్రగూడూరు గ్రామానికి చెందిన ఐదుగురిని  హోంక్వారంటైన్‌ చేసినట్లు మండల వైద్యాధికారి నరేశ్‌ తెలిపారు.  సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆవ్యక్తిని కలిసిన గ్రామానికి చెందిన ఐదుగురిని హోంక్వారంటైన్‌ చేశామన్నారు.

ఆలేరులో నలుగురికి..

ఆలేరుటౌన్‌: ఆలేరులో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని  మండల నోడల్‌ వైద్యాధికారి జ్యోతిబాయి సోమవారం విలేకరులకు తెలిపారు. పట్టణంలోని సుభాశ్‌నగర్‌, ఆదర్శ్‌నగర్‌కాలనీలో నలుగురికి కరోనా పరీక్షలు చేయగా అందరికీ పాజిటివ్‌ వచ్చిందన్నారు. 

వలిగొండలో ఒక్కరికి..

వలిగొండ:  మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ  అయిందని మండల వైద్యాధికారి సుమన్‌కల్యాణ్‌  తెలిపారు. మండలంలో నలుగురికి ర్యాపిడ్‌ కిట్ల ద్వారా పరీక్ష చేయగా ఒకరికి పాజిటివ్‌, ముగ్గురికి నెగెటివ్‌గా వచ్చిందన్నారు.

చౌటుప్పల్‌లో ఇద్దరికి...

చౌటుప్పల్‌: చౌటుప్పల్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సీహెచ్‌సీలో సోమవారం 32 మందికి  కరోనా పరీక్షలు చేశారు. అందులో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు.

మోటకొండూరు మండలంలో ఇద్దరికి..

మోటకొండూరు: మండలంలోని మాటూరులో ఒకరికి, అమ్మనబోలులో ఒకరికి కరో నా పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ రాజేందర్‌నాయక్‌ సోమవారం తెలిపారు. కరోనా సోకిన వారితో పాటు వారి కుటంబ సభ్యులను హోం క్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు. 

VIDEOS

logo