ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 28, 2020 , 00:07:40

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

 ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

  • అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి 

భువనగిరి : ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి కోరారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు అలసత్వం వహించొద్దన్నారు. గ్రామాల్లో సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అన్నిశాఖల అధికారులు ముందుండాలన్నారు. ఫోన్‌ ఇన్‌లో భాగంగా 45 ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ కార్యాలయ పాలనాధికారి నాగేశ్వరాచారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కస్టం మిల్లింగ్‌ బియ్యాన్ని సేకరించాలి

కస్టం మిల్లింగ్‌ బియ్యాన్ని రైస్‌ మిల్లుల నుంచి ఈనెల 31 నుంచి ఆగస్టు 15 వరకు సేకరించాలని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి సివిల్‌ సైప్లె అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయం నుంచి గూగుల్‌మీట్‌లో సివిల్‌సైప్లె అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఖరీఫ్‌ (వానకాలం) కస్టం మిల్లింగ్‌ బియ్యం పెండింగ్‌లో ఉన్న ఆరుశాతాన్ని జూలై 31నాటికి పూర్తి చేయాలని, రబీకాలంలో(యాసంగి) కస్టం మిల్లింగ్‌ బియ్యం పెండింగ్‌లో ఉన్న 89 శాతాన్ని ఆగస్టు 15నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ గూగుల్‌మీట్‌లో సివిల్‌సైప్లె డీఎం గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలి

శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కోరుతూ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి సోమవారం అదనపు కలెక్టర్‌  శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీబీనగర్‌ ఎస్‌వీజీ ఫ్యాక్టరీ వద్ద 13 రోజులుగా కార్మికులు శాంతియుతంగా సమ్మె చేస్తుంటే ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టిం చుకోవడం లేదన్నారు. కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు.  వినతిపత్రం అందజేసిన వారిలో కార్మిక సంఘం నాయకులు మీసాల పాండరి, బీఎస్‌ఎన్‌రెడ్డి  తదితరులు ఉన్నారు. 

VIDEOS

logo