బుధవారం 24 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 27, 2020 , 00:03:36

అందమైన మనసు

అందమైన మనసు

  • n   చౌటుప్పల్‌ చేనేత సహకార సంఘాన్ని సందర్శించిన సినీనటి పూనమ్‌కౌర్‌
  •   n  సొంత ఖర్చుతో చేనేత కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ 

సినీ నటి పూనమ్‌కౌర్‌ పెద్ద మనసు చాటుకున్నారు. చౌటుప్పల్‌ చేనేత సహకార సంఘాన్ని ఆమె ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత చీరలను చూసి మురిసిపోయారు. చేనేత కార్మికుల ప్రతిభ అత్యద్భుతమని ప్రశంసించారు. అనంతరం చేనేత సంఘం భవనంలో తన సొంత ఖర్చులతో 201మంది చేనేత కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. 

 

చౌటుప్పల్‌ : చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని సినీనటి పూనమ్‌కౌర్‌ అన్నారు. చౌటుప్పల్‌ చేనేత సహకార సంఘాన్ని ఆదివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత చీరెలను చూసి ఆమె మురిసిపోయారు. చేనేత చీరెలు ఎంతో బాగున్నాయని, చేనేత కార్మికుల ప్రతిభ అత్యద్భుతమని అన్నారు. తెలంగాణ చేనేత రంగానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉందని కొనియాడారు. అనంతరం చేనేత సంఘం భవనంలో తన సొంత ఖర్చు రూ.2లక్షలతో 201 మంది చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చేనేత కార్మికుల నైపుణ్యానికి తాను ముగ్ధురాలినయ్యానని తెలిపారు. లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశానని తెలిపారు. చేనేత కార్మికుల ప్రతిభ ఎంత పొగిడినా తక్కువేనని కితాబిచ్చారు. అగ్గిపెట్టెలో పట్టే చేనేత చీరెను తయారు చేసిన ఘనత ఇక్కడి చేనేత కార్మికులదని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ వీరిని ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు. కాగా, సినీనటి పూనమ్‌కౌర్‌ను చూసేందుకు పట్టణ వాసులు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో మంద వెంకన్న నేత, శ్రీబాలజీ రామకృష్ణ దేవాలయం అధ్యక్షుడు బడుగు మాణిక్యం, చేనేత సంఘం అధ్యక్షుడు కందగట్ల భిక్షపతి, నాయకులు గోశిక స్వామి, గుర్రం నర్సింహ, గోశిక ధనుంజయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo