గురువారం 04 మార్చి 2021
Yadadri - Jul 27, 2020 , 00:03:57

చివ‌రి మ‌జిలీకి చింత‌లేకుండా..

చివ‌రి మ‌జిలీకి చింత‌లేకుండా..

  • n  గ్రామీణాభివృద్ధి ఆధ్వర్యంలో 90, పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో 330  నిర్మాణాలు
  • n  సకల సౌకర్యాలతో  వైకుంఠధామాలు
  • n  అందరినీ ఒకే చోట దహణం చేయటమే ఉద్దేశం
  • n  నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి 
  • డీఆర్‌డీఏ పీడి మందడి ఉపేందర్‌రెడ్డి

మనిషికి జననం ఓ సందర్భం... మరణం ఓ వేడుక అన్నారు పెద్దలు. జీవితంలోని ఆఖరి మజిలీకి ఆటంకాలు ఉండకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ చితికి చోటులేని లోకంలో ఉన్నామనేది కఠోర సత్యం. అయితే తెలంగాణ ప్రభుత్వం చివరి మజిలీకి చింత లేకుండా చేస్తున్నది. ప్రతి పల్లెలోనూ వైకుంఠధామాల నిర్మాణాలను వడి వడిగా చేపడుతున్నది. జిల్లాలో 420 గ్రామపంచాయతీలలో వైకుంఠధామాల ఏర్పాటు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఒక్కో వైకుంఠధామంలో రెండు దహన వేదికలు, దింపుడు కల్లాలు, ఒక స్టోర్‌ రూం, సందర్శకుల షెడ్‌, రెండు మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునే గది, సింథటిక్‌ ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌, సోలార్‌లైటింగ్‌, నీటిసరఫరా, ప్రహరీ తదితర సౌకర్యాలున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌  శాఖల సమన్వయంతో వైకుంఠధామాలను వేగవంతంగా పూర్తి చేస్తూ ప్రగతి వైపు పల్లెలు అడుగులు వేస్తున్నాయి.

 భువనగిరి : ఎన్ని ఏండ్లు బతికామన్నది గొప్ప కాదు.. ఎలా బతికామన్నదే గొప్ప అలాంటి మనిషి జీవితంలో చివరాంకంలో చితికి సరైన చోటు లేక గతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ పాలనలో చివరి మజిలీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిహంగులతో వైకుంఠధామాలను వడివడిగా నిర్మాణాలు చేపడుతుంది. ప్రతి గ్రామంలో ఎవరు చనిపోయినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 421 గ్రామ పంచాయతీలకు 420 గ్రామపంచాయతీలలో వైకుంఠధామాల ఏర్పాటు ప్రక్రియలో వేగం పుంజుకున్నాయి. వడివడిగా నిర్మాణాలు సాగుతూ తుదిదశకు చేరుకుంటున్నాయి. గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టే వైకుంఠధామాలను జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌  శాఖలు సమన్వయంతో పనిచేస్తూ వైకుంఠధామాలను వేగవంతంగా పూర్తి చేస్తూ ప్రగతి వైపు అడుగులు వేస్తున్నాయి.

ప్రతిష్టాత్మకంగా వైకుంఠధామాల నిర్మాణం.. 


గ్రామీణాభివృద్ధి ఆధ్వర్యంలో 90, పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో 330 నిర్మాణాలు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వైకుంఠధామాల నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టేందుకు వీలుగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖలను సమన్వయపరుస్తూ పనులను చేపడుతుంది. జిల్లాలోని 420 గ్రామపంచాయతీల్లో నిర్మాణమౌతున్న వైకుంఠధామాల్లో 90 వైకుంఠధామాలు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, మిగిలిన 330 వైకుంఠధామాలు పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో నిర్మాణాలు జరుగుతున్నాయి. కాగా గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో చేపట్టే వైకుంఠధామాల నిర్మాణాలకు ఒక్కో దానికి రూ.11లక్షల 60వేలు కాగా, పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టే 330 వైకుంఠధామాల్లో ఒక్కో దానికి రూ.12లక్షల 60వేలుగా అంచనాలను అధికారులు రూపొందించారు. ఈక్రమంలో జిల్లాలోని పలు గ్రామాల్లో వైకుంఠధామాలు పూర్తికాగా మరికొన్ని చివరి దశకు చేరుకున్నాయి.

సకల సౌకర్యాలతో వైకుంఠధామాలు..

గ్రామాల్లో చేపడుతున్న వైకుంఠధామాల నిర్మాణాలు సకల సౌకర్యాలతో రూపుదిద్దుతున్నారు. శ్మశాన వాటికల్లో నెలకొన్న సమస్యలకు చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం వైకుంఠధామాలను అన్నిహంగులతో రూపుదిద్దుతున్నది. ఇందులో భాగంగా ఒక్కో వైకుంఠధామంలో రెండు రెండు దహన వాటికలు, దింపుడు కల్లాలు, ఒక స్టోర్‌ రూం, సందర్శకుల షెడ్‌, రెండు మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునే గది, సింథటిక్‌ ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌, సోలార్‌లైటింగ్‌, నీటిసరఫరా, ప్రహరీ నిర్మాణాలు తదితర హంగులతో వైకుంఠధామాలు నిర్మాణమౌతున్నాయి.

మతాలకతీతంగా అంతిమ సంస్కారాలు చేయటమే ఉద్దేశం..

గ్రామాల్లో ఉన్న వివక్షను తొలగిస్తూ అన్ని వర్గాలను కలుపుతూ, ఎవరికైనా చివరి మజిలీ ఒకటే అని చాటేలా గ్రామాల్లో పేద, ధనిక, వర్ణ, వర్గ, కులమతాలకు అతీతంగా చనిపోయిన వ్యక్తులను ఒకే చోట అంతిమ సంస్కారాలు చేపట్టాలనేదే వైకుంఠధామాల ముఖ్య ఉద్దేశం. ఇందుకు అనుగుణంగా అన్ని గ్రామాల్లో విశాలమైన స్థలాల్లో వైకుంఠధామాల ఏర్పాటు చర్యలు పూర్తి చేస్తున్నారు.

నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి... 


గ్రామాల్లో చేపడుతున్న వైకుంఠధామాల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి. జిల్లాలోని 420 గ్రామపంచాయతీలలోని వైకుంఠధామాలు పనుల్లో వేగం పుంజుకుంది. జిల్లాలో ఇప్పటికే 18 వైకుంఠధామాలు పూర్తయ్యాయి. మరో 18 వైకుంఠధామాలు సోలార్‌లైట్ల బిగింపు పక్రియ ఉంది. అంతేకాకుండా అన్నిగ్రామాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతూ పనుల పురోగతిని సమీక్షిస్తున్నాం. త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటున్నాం. 

-డీఆర్‌డీఏ పీడీ మందడి ఉపేందర్‌రెడ్డి

VIDEOS

logo