సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jul 27, 2020 , 00:07:41

ఆగ‌ని క‌రోనా..!

ఆగ‌ని క‌రోనా..!

భూదాన్‌పోచంపల్లి : రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పోచంపల్లి పట్టణంలో మ రో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి యాదగిరి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణానికి చెందిన ఓ యువకునికి కరోనా లక్షణాలు ఉండటంతో చౌటుప్పల్‌ ప్రభుత్వ దవాఖానలో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చిందన్నారు. దీంతో అతడిని హోం క్వారంటైన్‌ చేశామన్నారు. అదేవిధంగా పట్టణంలోని మరో వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. అయితే అతనికి తీవ్ర జ్వరం ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో వారం రోజులుగా చికిత్స పొందుతుండగా ఎంతకూ తగ్గకపోవడంతో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలిందన్నారు. అంతేకాకుండా పోచంపల్లిలో అద్దెకు ఉంటున్న ఓ మహిళకు కూడా కరోనా లక్షణాలు ఉండటంతో బీబీనగర్‌ ఎయిమ్స్‌లో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, దీంతో ఆమె అక్కడే చికిత్స చేయించుకుంటుందన్నారు.

అడ్డగూడూరులో ఒకరికి.. 

 అడ్డగూడూరు : మండలంలోని కొండంపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి నరేశ్‌ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న కొండంపేట గ్రామానికి చెందిన వ్యక్తి ఇటీవల హైదరాబాద్‌లోని యశోద దవాఖానలో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. దీంతో కరోనా వచ్చిన వ్యక్తితోపాటు కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు.

VIDEOS

logo