శనివారం 06 మార్చి 2021
Yadadri - Jul 27, 2020 , 00:08:08

రుచికి చింత చిగురు

రుచికి చింత చిగురు

యాదాద్రి కల్చరల్‌ : చింత చిగురు అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం. ఏ రుతువులో దొరికే పండ్లు, కూరలను ఆయా రుతువుల్లో వాడడం ఎంతో ఆరోగ్యకరం. ఈ సీజన్‌లో అధికంగా లభించే చింత చిగురును తినడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చింత చిగురులో డైటరీ ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. దీని ద్వారా మలబద్ధకం సమస్య ఉండదు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడంతో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.


lకొన్ని రకాల జ్వరాలకు ముఖ్యంగా చలిజ్వరానికి చింత చిగురు మంచి మందు. చింతచిగురును నీటిలో వేసి వేడి చేసిన తరువాత ఆ నీటిని పుక్కిలిస్తే గొంతునొప్పి, మంట, వాపు లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు చింతచిగురులో ఎక్కువ.

lవేడి వేడి మసాలా పదార్థాలు తినడంతో నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను చింత చిగురు తగ్గిస్తుంది. అంతేకాకుండా గుండె జబ్బులను నివారిస్తుంది. శరీరంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింతచిగురులో ఎక్కువగా ఉన్నాయి.

lకడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది.

lఇందులో విటమిన్‌ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.

lపలు రకాల క్యాన్సర్లు రాకుండా చేసే ఔషధ గుణాలు చింత చిగురులో ఎక్కువగా ఉన్నాయి. తరచుగా చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని పొందుతాయి.

lథైరాయిడ్‌, డయాబెటిస్‌ సమస్యలతో బాధపడుతున్న వారు చింత చిగురును ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

lశరీరంలో వ్యర్థాలను బయటికి పంపే శక్తి చింత చిగురుకు ఉంది. అంతేకాకుండా కంటి సమస్యలను చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగాదురదగా ఉంటే కాస్తంత చిగురు తింటే సరిపోతుంది. చింత చిగురును పప్పు, కూరగా, పచ్చడి రూపంలో తీసుకోవచ్చు. అంతేకాకుండా మాంసాహార ప్రియులు చింతచిగురుతో పలురకాల వంటలు చేసుకుంటారు.


VIDEOS

logo