ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Jul 26, 2020 , 00:01:56

గుట్ట పట్టణ సీఐగా జానకీరెడ్డి బాధ్యతల స్వీకరణ

గుట్ట పట్టణ సీఐగా జానకీరెడ్డి బాధ్యతల స్వీకరణ


ఆలేరు: యాదగిరిగుట్ట పట్టణ సీఐగా జానకీరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.  శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈయన గతంలో హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో సీఐగా పని చేసి బదిలీపై గుట్టకు వచ్చారు. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన జానకీరెడ్డి 1998వ బ్యాచ్‌లో ఎస్‌ఐగా ఉద్యోగం పొంది మొదటిసారిగా ఖమ్మం జిల్లాలోని ఏడూళ్లబయ్యారం ఎస్‌ఐగా పనిచేశారు. అనంతరం ఎల్బీనగర్‌, మల్కాజిగిరి, కాచిగూడ, నిజామాబాద్‌ జిల్లా పోలీస్‌స్టేషన్లలో పని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రికి బదిలీ కావడం ఆనందంగా ఉందన్నారు. 

VIDEOS

logo