ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Jul 26, 2020 , 00:02:25

పేదలకు అండగా సీఎం సహాయనిధి

పేదలకు అండగా సీఎం సహాయనిధి

మోటకొండూర్‌ : నిరుపేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ కార్యదర్శి పన్నీరు భరత్‌కుమార్‌కు సీఎం రిలీఫ్‌ఫండ్‌ కింద మంజూరైన రూ.50వేల చెక్కును యాదగిరిగుట్ట పట్టణంలో లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ.. రాష్ట్ర ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆడెపు విజయస్వామి, టీఆర్‌ఎస్‌ నాయకుడు గంధమల్ల పాండు తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo