శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 26, 2020 , 00:02:52

యాదాద్రిలో శాస్ర్తోక్తంగా స్వామివారి నిత్యపూజలు

యాదాద్రిలో శాస్ర్తోక్తంగా స్వామివారి నిత్యపూజలు

ఆలేరు: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం శ్రీస్వామివారికి అర్చకులు శాస్ర్తోక్తంగా సంప్రదాయ పూజలు నిర్వహించారు. నిత్యపూజల సందడి కొనసాగింది. ఉదయమే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాతం నిర్వహించారు. అనంతరం స్వామివారి అర్చనలు, అభిషేకం, సువర్ణ పుష్పార్చన చేపట్టారు. మండపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు, శ్రీసుదర్శన నారసింహహోమం జరిపారు. ఆగమశాస్త్రంగా శ్రీస్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మంటపంలోనే ఊరేగించారు. కల్యాణ తంతును జరిపారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయుడికి పూజలు, రాత్రి సమయంలో శ్రీస్వామి అమ్మవార్లకు మహానివేదన జరిపించారు. అనంతరం శయనోత్సవం నిర్వహించారు. నాగపంచమి సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైన గల పుట్టలో పలువురు మహిళలు పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీవారి ఖజానాకు రూ.2,55,742 ఆదాయం

శ్రీవారి ఖజానాకు రూ.2,55,742 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రచారశాఖ ద్వారా రూ.1,925, ప్రసాదం విక్రయాలతో రూ. 1,79,800, వాహనపూజలతో రూ. 6,700, మినీ బస్సులతో రూ. 900, కొబ్బరికాయలతో రూ. 12వేలు, అన్నప్రసాదంతో రూ.3,717, ఇతర విభాగాలతో రూ. 50వేలు కలిపి శ్రీవారి ఖజానాకు రూ. 2,55,742 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. 

VIDEOS

logo