బుధవారం 03 మార్చి 2021
Yadadri - Jul 26, 2020 , 00:05:19

రైతుల భూములు ఆక్రమించిన రియల్‌ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలి

రైతుల భూములు ఆక్రమించిన  రియల్‌ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలి

భువనగిరి : రైతుల పట్టా భూములు ఆక్రమించుకుని ఇబ్బందులకు గురిచేస్తున్న రియల్‌ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని  సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ డిమాండ్‌ చేశారు. శనివారం రైతులతో కలిసి ఆర్డీవో భూపాల్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడు  తూ..మండలంలోని బీఎన్‌ తిమ్మాపురం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబరు 56లోని 9 ఎకరాల 16 గుంటల భూమిని ఆక్రమించుకుని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు. రెవెన్యూ ఉద్యోగులను మభ్యపెడుతూ రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు జిట్టా అంజిరెడ్డి, రైతులు పెద్ద ఎల్లయ్య, సత్యనారాయణ, ఉడుత రవి, సత్తయ్య, కృష్ణ, ఎల్లయ్య, నాగులు, హరినాథ్‌, శ్రీను, జహంగీర్‌ పాల్గొన్నారు. 

VIDEOS

logo