గురువారం 29 అక్టోబర్ 2020
Yadadri - Jul 25, 2020 , 00:01:59

చిరునవ్వే కానుకగా..

చిరునవ్వే కానుకగా..

  • ఘనంగా మంత్రి కేటీఆర్‌ జన్మదిన  వేడుకలు 


మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. యాదగిరి గుట్టలో టీఆర్‌ఎస్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. యాదాద్రీశుడి ఆశీస్సులు మంత్రి కేటీఆర్‌కు ఉండాలని ఆకాంక్షించారు. ఆలేరులో డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి కేక్‌ కట్‌ చేసి సంబురాల్లో పాల్గొన్నారు. భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు డా. పల్లా రాజేశ్వర్‌రెడ్డి కేక్‌కట్‌ చేశారు.

  - నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్‌ 


logo