అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు

- యువకుడు మృతి.. మరో ముగ్గురు సురక్షితం
భూదాన్‌పోచంపల్లి: అదుపుతప్పిన కారు చెరువులోకి దూసుకువెళ్లింది. దీంతో ఓ యువకుడు మృతి చెందగా మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన మండలంలోని జలాల్పూర్ గ్రామంలో చోటు చేసుకున్నది. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్కు చెందిన జింక వంశీ (24) ముగ్గురు స్నేహితులతో కలిసి మండలంలోని రామలింగంపల్లికి చెందిన బంధువుల ఇంటికి గురువారం రాత్రి వస్తుండగా జలాల్‌పూర్‌లోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ దాటిన తర్వాత మూలమలుపులో కారు స్పీడ్‌గా దూసుకురావడంతో అదుపు తప్పి చెరువులోపడిపోయింది. అయితే వంశీ కారును డ్రైవ్ చేస్తూ సీటు బెల్ట్పెట్టుకోవడంతో ఇరుక్కుపోయి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. అతని స్నేహితులు ముగ్గురు కారుడోర్ తీసుకొని బయట పడ్డారు. ఈ విషయం తెసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని వంశీ మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై సైదిరెడ్డి తెలిపారు.
నేడు మండలంలో ఎమ్మెల్యే పైళ్ల పర్యటన
వలిగొండ: మండలంలోని ప్రొద్దటూర్, పహిల్వాన్పూర్, రెడ్లరేపాక గ్రామాల్లో శనివారం రైతు వేదికల నిర్మాణ పనుల శంకుస్థాపనకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి హాజరుకానున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షు డు డేగల పాండరి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాజావార్తలు
- లీటర్ పెట్రోల్ ధర రూ.100.. ఇక కామనే.. మోత మోగుడు ఖాయం
- మ్యాన్‌హోల్‌లో చిక్కుకుని నలుగురు మృతి
- ఉత్తమ రైతు మల్లికార్జున్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్‌షా
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- హైదరాబాద్‌లో అజిత్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
- అవినీతి మన వ్యవస్థలో ఒక భాగం: మహారాష్ట్ర డీజీపీ