మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Jul 25, 2020 , 00:06:23

ఘ‌నంగా మంత్రి కేటీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు

ఘ‌నంగా మంత్రి కేటీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు

భువనగిరి : రాష్ట్ర మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని శుక్రవారం పట్టణంలోని రాయగిరి గ్రామంలోని సహృదయ అనాథాశ్రమంలో ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా అనాథాశ్రమంలోని వృద్ధులకు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య  అన్నదానం చేశారు.   ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు గడ్డం సత్యనారాయణ, రఘుమారెడ్డి, అనిల్‌, రాజు, నర్సింహ, ఆశ్రమ కోఆర్డినేటర్‌ నజీర్‌ పాల్గొన్నారు.

బీబీనగర్‌లో...

బీబీనగర్‌:  మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు మండలం వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాయరావుపేటలో ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి  మొక్కలు నాటారు. బీబీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ బొక్క జైపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌  మండల అధ్యక్షుడు రాచమల్లశ్రీనివాసులు, సర్పంచ్‌ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కేక్‌కట్‌చేసి సంబురాలు చేసుకున్నారు. కొండమడుగులో వైస్‌ ఎంపీపీ వాకిటి గణేశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌  మండల ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి , గూడూరులో జాగృతి జిల్లా అధ్యక్షుడు బాశబోయిన బాలప్రసాద్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు. 

నిత్యావసర సరుకులు పంపిణీ

భువనగిరి అర్బన్‌: మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకల సందర్భంగా పట్టణంలోని 17వ వార్డు కౌన్సిలర్‌ చెన్న స్వాతీమహేశ్‌ సౌజన్యంతో అందజేసిన నిత్యావసర సరుకులను మున్సిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు శుక్రవారం పేదలకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు గాదె శ్రీనివాస్‌, నాయకులు డోగిపర్తి రవి, గడ్డం సోమ్‌చంద్‌, బచ్చు శ్రవణ్‌, కడారి అనిల్‌, నరేశ్‌, జయంత్‌  పాల్గొన్నారు.   

పోచంపల్లిలో

భూదాన్‌పోచంపల్లి:  జడ్పీటీసీ కోట పుష్పలతామల్లారెడ్డి తన నివాసంలో  మొక్క నాటి కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయగా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల  అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డితో కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ బాత్క లింగస్వామి, కౌన్సిలర్‌ గుండు మధు, మాజీ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ దొడ్డమోని చంద్రంయాదవ్‌  పాల్గొన్నారు. 

వలిగొండలో...

వలిగొండ:  మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా శుక్రవారం మండలంలోని దుప్పెల్లిలో ఎంపీటీసీ పల్సం ఆండాలునర్సయ్య, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. టీఆర్‌ఎస్‌ మండల యూత్‌ విభాగం ఆధ్వర్యంలో టేకులసోమారంలోని సాధన మానసిక వికలాంగుల ఆశ్రమంలో కేక్‌కట్‌ చేసి మానసిక వికలాంగులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు  లింగస్వామి, గ్రంథాలయ చైర్మన్‌ పల్లెర్ల ప్రకాశ్‌, మహేశ్‌, కట్టెల నర్సయ్య, దుప్పెల్లి గ్రామశాఖ అధ్యక్షుడు బాలగోని భిక్షం, కార్యదర్శి బొమ్మగాని బాలయ్య, కన్నెబోయిన రాజేశ్వరి, మనిమిద్దె రాములు, నీల ముత్తయ్య, బోళ్ల వెంకన్న, అంబటి శ్రీను, బాలగోని వెంకన్న పాల్గొన్నారు.

VIDEOS

logo