మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Jul 23, 2020 , 22:43:28

ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ను పూర్తి చేయాలి

 ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ను పూర్తి చేయాలి

భువనగిరి అర్బన్‌ : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పాత డీఎస్పీ కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బిల్డింగ్‌, గదులను పూర్తిగా పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ పెరుగుతుందని, ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. 

అనంతరం హరితహారంకార్యక్రమంలో భాగం గా పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్క నాటారు. ఆయన వెంట డీసీపీ కె.నారాయణరెడ్డి, ఏసీపీ భుజంగరావు, ఏఆర్‌ ఏసీపీ కిష్టయ్య, పట్టణ ఇన్‌స్పెక్టర్‌ ఎ.సుధాకర్‌, ట్రాఫిక్‌ సీఐలు రాజు, సతీశ్‌, ఎస్సైలు అంజయ్య, వినోద్‌, సిబ్బంది ఉన్నారు. 

 పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌ స్థల పరిశీలన 

ఆలేరు: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆల యం సమీపంలో నిర్మించే పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణానికి కావాల్సిన భూమి వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జలాలు అందించేందుకు నిర్మించే కాలువ క్వార్టర్‌ నిర్మించే ప్రాంతం నుంచే వెళ్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ నారాయణరెడ్డి, ఏఆర్‌ ఏసీపీ కిష్టయ్య, సీఐ నర్సయ్య, ఎస్సై గుండెల రాజు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo