సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jul 23, 2020 , 22:41:14

నూతన ఆవిష్కరణలకు గడువు పెంపు

 నూతన ఆవిష్కరణలకు గడువు పెంపు

భువనగిరి : ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆసక్తి గల ఆవిష్కర్తల నుంచి ఆవిష్కరణలను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు ఆమె పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఈ ఆవిష్కరణలు ఉంటాయని, ప్రదర్శనలో పాల్గొనడానికి అన్ని రంగాల, అన్ని వర్గాల ప్రదర్శనలు ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.

గ్రామీణ ఆవిష్కరణలు, విద్యార్థుల ఆవిష్కరణలు, ప్రారంభ ఆవిష్కరణలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలలో ఆవిష్కరణలు అంగీకరించబడతాయన్నారు.ఇన్నోవేటర్‌లు తమ ఆవిష్కరణలో పాల్గొనే వారికి, వారి ఇన్నోవేషన్‌కు సంబంధించిన రెండు, మూడు నిమిషాల  వీడియోను, సంబంధిత నాలుగు ఫొటోలను, ఆవిష్కర్త పేరు, వయసు, వృత్తి, ఊరు, జిల్లా పేరుతో వివరాలను 9100678543నెంబరుకు వాట్సాప్‌ ద్వారా అందించాలన్నారు.

VIDEOS

logo