శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Jul 23, 2020 , 22:40:10

రైతు వేదిక నిర్మాణాలను వేగవంతం చేయాలి

 రైతు వేదిక నిర్మాణాలను వేగవంతం చేయాలి

  • అదనపు కలెక్టర్‌ కీమ్యానాయక్‌

 భువనగిరి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు సమగ్ర చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ కీమ్యానాయక్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయం నుంచి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో గూగుల్‌మీట్‌ ద్వారా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలోని 92 క్లస్టర్‌లలో రైతు వేదిక నిర్మాణాలను వేగంగా చేపట్టాలన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. రైతులు వ్యవసాయ అధికారుల వద్ద తమ తమ పంట వివరాలకు సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలన్నారు. ఈ గూగుల్‌మీట్‌లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్‌, పంచాయతీరాజ్‌, డీఆర్‌డీఏ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

VIDEOS

logo