మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Jul 23, 2020 , 22:34:16

యాదాద్రిలో వైభవంగా నిత్యపూజలు

 యాదాద్రిలో వైభవంగా నిత్యపూజలు

ఆలేరు : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం స్వామివారికి నిత్యపూజలు వైభవంగా జరిగాయి. మొదటగా సుదర్శన నారసింహ హోమం నిర్వహించి బాలాలయంలో ప్రతిష్ఠామూర్తులను పంచామృతాలతో అభిషేకించారు. 

అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణం అత్యంత వైభవంగా జరిపారు.  వివిధ పుష్పాలతో శ్రీస్వామి, అమ్మవార్లను అలంకరించారు. తులసీ దళాలు, బంగారు పుష్పాలతో అర్పించారు. మండపంలోని ఉత్సవమూర్తులకు అష్టోత్తర సేవలు నిర్వహించారు. మహా మండపంలో కల్యాణ సేవ జరుపగా  భక్తులు సామాజిక దూరంతో శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.


ఖజానాకు రూ. 1,52,664 ఆదాయం 

శ్రీవారి ఖజానాకు రూ. 1,52,664 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రచారశాఖ ద్వారా రూ. 4,000, ప్రసాద విక్రయాలతో రూ. 1,06,260, వాహనపూజల ద్వారా రూ. 5,200, కొబ్బరికాయలతో రూ. 7,500, శాశ్వతపూజలతో రూ. 28,464లతో కలిపి శ్రీవారి ఖజానాకు రూ. 1,52,664 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. 

VIDEOS

logo