మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Jul 22, 2020 , 22:55:17

గుర్తు తెలియని వృద్ధుడు మృతి

గుర్తు తెలియని వృద్ధుడు మృతి

భువనగిరి : గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన ఘటన పట్టణ పరిధిలోని రాయగిరి గ్రామ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వృద్ధుడు 55-60 వయసు కలిగి గ్రామ సమీపంలోని ఇటుకల బట్టీల పక్కన వ్యవసాయ పొలాల వద్ద మృతి చెంది ఉన్నాడని తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు రూరల్‌ ఏఎస్‌ఐ సాగర్‌రావు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ దవాఖాన మార్చురీలో భద్రపర్చామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి ఒంటిపై గల్లాలుంగీ ఉందని చెప్పారు. 

VIDEOS

logo