మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Jul 22, 2020 , 22:54:00

వైభ‌వంగా శ్రీ సుద‌ర్శ‌న నార‌సింహ హోమం

వైభ‌వంగా శ్రీ సుద‌ర్శ‌న నార‌సింహ హోమం

ఆలేరు: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని బాలాలయ మంటపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం నిత్య కల్యాణాన్ని శాస్ర్తోక్తంగా జరిపారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మంటపంలోనే ఊరేగించారు. సుమారు గంటన్నరపాటు కల్యాణ తంతును జరిపారు. స్వామివారి నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. వేకువ జామునే సుప్రభాత సేవ చేపట్టి, ప్రతిష్ఠామూర్తులను ఆరాధిస్తూ హారతి నివేదించారు. ఉత్సవమూర్తులను అభిషేకించి, తులసీ పత్రాలతో అర్చించి, దర్శన మూర్తులకు సువర్ణ పుష్పార్చన చేశారు. మంటపంలో స్వామివారికి అష్టోత్తర పూజ, విశ్వక్సేనారాధన జరిపారు. సాయంత్రం ఆలయ మంటపంలో సేవోత్సవం, రాత్రి అమ్మవార్లకు శయనోత్సవాన్ని నిర్వహించారు.  


శ్రీవారి ఖజానాకు రూ. 1,34,286 ఆదాయం

శ్రీవారి ఖజానాకు రూ. 1,34,286 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రచారశాఖ ద్వారా రూ. 1,000, ప్రసాద విక్రయాలతో రూ. 1,05,040, వా హన పూజల ద్వారా రూ. 4,600, కొబ్బరికాయలతో రూ. 13,230, ఇతర విభాగాలతో రూ. 300తో కలిపి శ్రీవారి ఖజానాకు రూ.  1,34,286 సమకూరినట్లు తెలిపారు. 

VIDEOS

logo