శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 20, 2020 , 00:12:10

గ్రామాల్లో మోస్తరు వర్షం

గ్రామాల్లో మోస్తరు వర్షం

ఆలేరు: యాదగిరిగుట్ట పట్టణంతో పాటు పలు గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఆదివారం పట్టణంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వర్షం పడింది. దీంతో రోడ్లు, పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  సైదాపురం, మాసాయిపేట, గౌరాయిపల్లి, వంగపల్లి, చిన్నకందుకూరు, చొల్లేరు, మర్రిగూడెం, మహబూబ్‌పేట, పెద్దకందుకూరు, బాహుపేట, కాచారం గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

అడ్డగూడూరులో.. 

అడ్డగూడూరు: మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం మోస్తరు వర్షం కురిసింది.ఉదయం నుంచి ఎండవల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం వర్షం రావడంతో కాస్త ఉపశమనం పొందారు. ఈ వర్షం మెట్ట పంటలకు లాభదాయకమని రైతులు తెలిపారు.

VIDEOS

logo