ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 20, 2020 , 00:10:44

ఆగని కరోనా

ఆగని కరోనా

బీబీనగర్‌ :  బీబీనగర్‌లోని పీహెచ్‌సీలో ఏఎన్‌ఎంగా విధులు నిర్వహించే మహిళకు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రావడంతో వారి కుటుంబసభ్యులకు పరీక్షలు చేశారు. దీంతో ఆమె కుమారుడికి సైతం కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి ఆదివారం తెలిపారు. ప్రస్తుతం వారిని హోం క్వారంటైన్‌లోనే ఉంచి చికిత్స చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

డి.రేపాకలో ఒకరికి కరోనా పాజిటివ్‌

అడ్డగూడూరు: మండలంలోని డి.రేపాక గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి నరేశ్‌ ఆదివారం తెలిపారు. ఆరు రోజుల క్రితం షుగర్‌ ఎక్కువగా ఉందని అతను చికిత్స కోసం నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు వెళ్లాడు  అక్కడ జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతని కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్‌ చేసినట్లు మండల వైద్యాధికారి తెలిపారు. 

బొల్లేపల్లిలో భార్యాభర్తలకు కరోనా పాజిటివ్‌

భువనగిరి : మండలంలోని బొల్లేపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆదివారం మండల వైద్యాధికారులు రాజేందర్‌, శోభ తెలిపారు. గతంలో ఆ కుటుంబానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రాగా ప్రైమరీ కాంటాక్ట్‌లుగా హోంక్వారంటైన్‌ చేశారు. ఈక్రమంలో సేకరించిన రక్త నమూనాల్లో పాజిటివ్‌గా వచ్చిందన్నారు. కాగా వీరిని హోంఐసొలేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారి ఇంటి పరిసరాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని ఆరోగ్య సిబ్బంది పిచికారీ చేశారు.

VIDEOS

logo