గురువారం 22 అక్టోబర్ 2020
Yadadri - Jul 18, 2020 , 23:23:17

సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి

 సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి

  • అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి

భువనగిరి : రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీస్‌ అసోసియేషన్‌ సభ్యులు శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో తనను కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని, ఆరోగ్య సూత్రాలను తప్పక పాటించాలన్నారు. రెవెన్యూ పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సమగ్ర చర్యలు చేపట్టాలని అన్నారు.

అదనపు కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పి. శ్యాంసుందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బాణాల రాంరెడ్డి, గుండాల తహసీల్దార్‌ దయాకర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కె. సుధాకర్‌రావు, పి. మనోహర్‌, హరికిషన్‌రావు, నాయకులు పూర్ణచందర్‌రావు, లోకేందర్‌రెడ్డి, నగేశ్‌ తదితరులు ఉన్నారు. 


logo