యాదాద్రిలో పవిత్రోత్సవాలు

- స్వామివారికి నిత్యపూజల సందడి
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయం, పాతగుట్ట నందు ఈ నెల 29 నుంచి 31 వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లుఆలయ ఈవో ఎన్.గీత తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామన్నారు. ఉత్సవాలలో నేపథ్యంలో 30 నుంచి 31వ తేదీల్లో ఆన్లైన్ ద్వారా శ్రీసుదర్శన నారసింహ హోమం, శ్రీస్వామివారి కల్యాణం యథావిధిగా నిర్వహించనున్నట్లు ఆమె చెప్పారు.
ఆలేరు : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం శ్రీస్వామివారికి అర్చకులు శాస్ర్తోక్తంగా సంప్రదాయ పూజలు నిర్వహించారు. ఉదయమే సుప్రభాతం అనంతరం స్వామివారి అర్చనలు, అభిషేకం, సువర్ణ పుష్పార్చన చేపట్టారు. మండపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు, శ్రీసుదర్శన నారసింహ హోమం జరిపారు. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీస్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మంటపంలో ఊరేగించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయుడికి పూజలు జరిగాయి. రాత్రి సమయంలో శ్రీస్వామిఅమ్మవార్లకు మహానివేదన జరిపించారు. అనంతరం శయనోత్సవం నిర్వహించారు.
ఖజానాకు రూ. 1,27,295 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 1,27,295 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారు లు తెలిపారు. ప్రచారశాఖ ద్వారా రూ. 1,925, ప్రసాద విక్రయాలతో రూ. 1,07,270, వాహనపూజల ద్వారా రూ. 6,900, మినీ బస్సుతో రూ. 800, కొబ్బరికాయలతో రూ. 9,750 తో కలిపి శ్రీవారి ఖజానాకు రూ. 1,27,295 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న సీఎంవో ప్రత్యేక కార్యదర్శి
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి ఆశీర్వాదం అందజేశారు. ఆయన వెంట వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీత, ఈఎన్సీ గణపతిరెడ్డి, వైటీడీఏ ఈఈ వసంతనాయక్, స్తపతి సలహాదారు ఆనందాచార్యుల వేలు తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన ఇద్దరికి యూకే స్ట్రెయిన్
- తాత అదుర్స్.. వందేళ్ల వయసులోనూ పని మీదే ధ్యాస
- బెంగాల్ పోరు : కస్టమర్లను ఊరిస్తున్న ఎన్నికల స్వీట్లు
- రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం..కడవరకు పోరాడుతాం
- ఏపీలో కొత్తగా 124 కరోనా కేసులు
- సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో సవరణలు
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్‌ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఇక్కడ బంగారం లోన్లపై వడ్డీ చౌక.. ఎంతంటే?!
- విమానంలో కరోనా రోగి.. బయల్దేరే ముందు సిబ్బందికి షాక్!
- టీఆర్ఎస్ ఎన్నారై ప్రజాప్రతినిధులతో రేపు ఎమ్మెల్సీ కవిత సమావేశం