ఆదివారం 25 అక్టోబర్ 2020
Yadadri - Jul 18, 2020 , 01:32:30

డయాలసిస్‌ సెంటర్‌లో వైద్యసేవలు ప్రారంభం

 డయాలసిస్‌ సెంటర్‌లో వైద్యసేవలు ప్రారంభం

ఆలేరుటౌన్‌:  మహావీర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆలేరులోని సీహెచ్‌సీ సమీపంలో ఏర్పాటు చేసిన నూతన డయాలసిస్‌ సెంటర్‌లో శుక్రవారం కిడ్నీ రోగులకు వైద్యసేవలు ప్రారంభమయ్యాయి. నిరుపేదలకు చౌకగా వైద్యం అందించాలనే  ఉద్దేశంతో దాతల సహాయంతో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి  రూ.25 లక్షలతో జిల్లాలో మొదటిసారిగా డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

మొదటిరోజు ఐదుగురికి డయాలసిస్‌ చేసినట్లు నిర్వాహకుడు రుక్మారెడ్డి విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆలేరు మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య మాట్లాడుతూ.. పట్టణంలో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వవిప్‌నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకుముందు ఆయన రోగులకు అందుతున్న వైద్య సేవలపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మొరిగాడి వెంకటేశ్‌ పాల్గొన్నారు.


logo