బుధవారం 28 అక్టోబర్ 2020
Yadadri - Jul 17, 2020 , 23:37:18

ఆక్సిజన్‌ సిలిండర్లు పట్టివేత

ఆక్సిజన్‌ సిలిండర్లు పట్టివేత

భువనగిరి అర్బన్‌: భువనగిరి పట్టణంలో అక్రమంగా విక్రయిస్తున్న ఆక్సిజన్‌ సిలిండర్ల యజమానిని ఎస్‌వోటీ పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని ఆజాద్‌రోడ్డు కాలనీకి చెందిన సయ్యద్‌ అన్వర్‌ ఆక్సిజన్‌ సిలిండర్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా, కనీస జాగ్రత్తలు పాటించకుండా ఆక్సిజన్‌ సిలిండర్లను గ్యాస్‌ వెల్డింగ్‌ షాపులకు అధిక ధరకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో పెద్ద ఆక్సిజన్‌ సిలిండర్లు 25, ఖాళీ సిలిండర్లు 53, సీవో2 సిలిండర్లు 3, ఆక్సిజన్‌ చిన్న సిలిండర్లు 7, ఖాళీ చిన్న సిలిండర్లు 8, ఒక ఆటో  స్వాధీనం చేసుకొని పట్టణ పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు.


logo