ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 15, 2020 , 01:13:28

కరోనా కౌంటర్‌

కరోనా కౌంటర్‌

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ప్రత్యేక బాక్స్‌ 

ఆత్మకూరు(ఎం) : కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే వారందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌ వద్ద తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు, ఫిర్యాదులను అందజేయాలని తహసీల్దార్‌ పి.జ్యోతి మంగళవారం తెలిపారు. మండల ప్రజలందరూ కరోనా వైరస్‌ నుంచి రక్షించుకునేందుకు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని చెప్పారు. 

VIDEOS

logo