ఆదివారం 09 ఆగస్టు 2020
Yadadri - Jul 13, 2020 , 23:49:38

ప్రజా సమస్యలపై తక్షణ చర్యలు

 ప్రజా సమస్యలపై  తక్షణ చర్యలు

  • అదనపు కలెక్టర్‌ కీమ్యానాయక్‌ 

భువనగిరి : ప్రజా సమస్యల పరిష్కారానికి ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా తగు చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్‌ కీమ్యానాయక్‌ తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో తాత్కాలికంగా రద్దు అయినందున అదనపు కలెక్టర్‌ ఫోన్‌ ఇన్‌ పోగ్రాంను సోమవారం కలెక్టర్‌ చాంబర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో భాగం గా 35 అర్జీలు నమోదు అయ్యాయి. అందులో 18 ఫిర్యాదులు రెవెన్యూ సంబంధించినవి రాగా, 17 ఇతర సమస్యలపై వచ్చాయి.ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


logo