శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 13, 2020 , 23:47:34

ముగిసిన అమ్మవారి బోనాలు

 ముగిసిన అమ్మవారి  బోనాలు

చౌటుప్పల్‌ రూరల్‌ : మండలపరిధిలోని దండు మల్కాపురం శ్రీ ఆందోల్‌మైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు సోమవారం ముగిశాయి. మూడురోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి గణపతిపూజ, సామూహిక కుంకుమార్చనలు, పూర్ణాహుతి హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో చిట్టెడి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఉత్సవాలు ముగించామన్నారు. భక్తులకు కూడా అనుమతులు ఇవ్వలేదన్నారు. అంతేకాకుండా మూడురోజుల పాటు ఉత్సవాలకు సహకరించిన ప్రతిఒక్కరికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

VIDEOS

logo