ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Jul 13, 2020 , 23:45:25

జిల్లాలో మోస్తరు వర్షం

 జిల్లాలో మోస్తరు వర్షం

భువనగిరి /రామన్ననపేట/ చౌటుప్పల్‌/ ఆలేరు రూరల్‌ : జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. మోత్కూర్‌లో 10మిమీ. ఆత్మకూర్‌(ఎం)లో 7.4 మిమీ. గుండాలలో 1మిమీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపా రు. రామన్నపేటలో కురిసిన వర్షానికి అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది. పత్తిగింజలు మొలకెత్తుతున్న వేళ వర్షం పడటంతో ఎరువు లు వేసే అవకాశం ఏర్పడింది. చౌటుప్పల్‌లో ఓ మోస్తరు వర్షం కురిసింది. సుమారు 20 నిమిషాలు ఎడతెరిపి లేకుండా కురియడంతో వాహనదారులు తడిసి ముద్దయ్యారు. మున్సిపాలిటీ కేంద్రంలో సర్వీస్‌ రోడ్డు పక్కన ఉన్న చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆలే రు మండలంలోని  పలు గ్రామాల్లో వర్షానికి విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. 

VIDEOS

logo