పంతంగిలో కరోనా పాజిటివ్

చౌటుప్పల్ రూరల్ : మండల పరిధిలోని పంతంగి గ్రామానికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి శివప్రసాద్‌రెడ్డి సోమవారం తెలిపారు. అతడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానాలో పరీక్షలు నిర్వహించుకోగా పాజిటివ్‌గా తెలిందని చె ప్పారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో హోం క్వారంటైన్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
రాయగిరిలో...
భువనగిరి : భువనగిరి పట్టణంలోని రాయగిరికి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యసిబ్బంది సోమవారం తెలిపారు. రాయగిరికి చెందిన యువకుడు నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆదివారం రాత్రి రిపోర్టుల్లో కరోనా పాజిటివ్‌గా రాగా యువకుడిని దవాఖానకు తరలించారు. ఆయన ఐదుగురు కుటుంబసభ్యులను హోంక్వారంటైన్లో ఉంచినట్లు తెలిపారు.
అడ్డగూడూరులో...
అడ్డగూడూరు : మండల కేంద్రంలో గ్రామపంచాయతీలో పని చేస్తున్న సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి నరేశ్ సోమవారం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి 10 రోజులుగా తీవ్రమైన జ్వరం రావడంతో హైదరాబాద్‌లోని ఓ దవాఖానకు వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. పాజిటివ్ వ్యక్తికి కాంటాక్ట్ అయిన 8 మంది గ్రామపంచాయతీ సిబ్బందిని హోంక్వారంటైన్ చేశామన్నారు.
హోంక్వారంటైన్లో 238మంది
భువనగిరి : కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జిల్లాలో 238మందిని హోంక్వారంటైన్లో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 72 మందికి పాజిటివ్ వచ్చిందని, 695 మంది నుంచి శాంపిల్స్ సేకరించామని చెప్పారు.
తాజావార్తలు
- ఎన్నికల రోజును సెలవుదినంగా భావించొద్దు: మంత్రి కేటీఆర్
- తెలంగాణ టూరిజం అంబాసిడర్‌గా బిగ్‌బాస్ హారిక
- బెంగాల్ పోరు : ఐదుగురు ఎమ్మెల్యేలు గుడ్‌బై..దీదీ పార్టీకి ఎదురుదెబ్బ!
- జీలపల్లిలో వడదెబ్బతో వ్యక్తి మృతి
- 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఘనంగా నిర్వహిస్తాం: సీఎం కేసీఆర్
- స్వచ్ఛంద ఈపీఎఫ్‌వో సభ్యులకు ‘ప్రత్యేక నిధి’!
- టీటీవీ దినకరణ్‌తో జతకట్టిన ఓవైసీ
- మేడ్చల్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- మచ్చలేని వ్యక్తిత్వం సురభి వాణీదేవి సొంతం
- ఎన్ఐఏకు.. ముఖేష్ ఇంటి వద్ద కలకలం రేపిన వాహనం కేసు దర్యాప్తు