మంగళవారం 11 ఆగస్టు 2020
Yadadri - Jul 12, 2020 , 23:42:04

అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లోకి చేరికలు..

అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లోకి చేరికలు..

భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పలు పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో స్వచ్ఛందంగా చేరుతున్నారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 34వ వార్డుకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో రూపుదిద్దుకునే బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించాలంటే టీఆర్‌ఎస్‌తోనే సాధ్యపడుతుందన్నారు.

పార్టీలో చేరిన వారిలో సరగడ అమర్‌, సుంచు నాగభూషణం, కొల్తూరి కిశోర్‌, బింగి వైకుంఠం, శ్రీరామోజు శ్రీనివాస్‌, కైరంకొండ శ్రీకాంత్‌, మంచాల సృజన్‌, పాములపర్తి బాలకృష్ణలతో పాటు 40మంది యువకులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్‌చైర్మన్‌ చింతల కిష్టయ్య, కౌన్సిలర్లు గోమారి సుధాకర్‌రెడ్డి, అవంచికక్రాంతి, ఆబోతుల కిరణ్‌కుమార్‌, జిట్టా వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు అతికం లక్ష్మీనారాయణగౌడ్‌, ఎడ్ల రాజేందర్‌రెడ్డి, బాషబోయిన రాజేశ్‌, కంచర్ల శ్రీధర్‌రెడ్డి, నాకోటి నగేశ్‌, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo