మంగళవారం 04 ఆగస్టు 2020
Yadadri - Jul 12, 2020 , 23:38:31

పరిశుభ్రతతోనే ఆరోగ్యం

పరిశుభ్రతతోనే ఆరోగ్యం

  • ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సూచించారు. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ఆదివారం పదిగంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా భువనగిరిలోని 33వ వార్డులో వార్డు కౌన్సిలర్‌ అవంచికక్రాంతితో కలిసి స్మృతివనంలో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించారు. - భువనగిరి 

భువనగిరి:పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్యంతోనే సం పూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సూ చించారు. మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 33వ వార్డులో కౌన్సిలర్‌ అవంచిక క్రాంతితో కలిసి స్మృతివనంలో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించి మాట్లాడారు. పట్టణంలోని ప్రతి వార్డులో ప్రజలు స్వచ్ఛందంగా పరిసరాల్లోని చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. వ్యాధికారక క్రిములు వ్యాప్తి చెందకుండా పారిశుధ్య సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలన్నారు. పచ్చదనం పెంపొందించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్‌చైర్మన్‌ చింతల కిష్టయ్య, వివిధ వార్డుల కౌన్సిలర్లు గోమారి సుధాకర్‌రెడ్డి, ఏవీ కిరణ్‌కుమార్‌, జిట్టా వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు బాషబోయిన రాజేశ్‌, అతికం లక్ష్మీనారాయణగౌడ్‌, ఈ.గోపాల్‌, నాగభూషణం పాల్గొన్నారు.


logo