వైభవంగా స్వామివారి నిత్యకల్యాణం

ఆలేరు: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో ఆదివారం శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆగమశాస్త్రంగా కల్యాణ తంతును అర్చకులు నిర్వహించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. సుమారు గంటన్నరపాటు కల్యాణ తంతును జరిపారు. స్వామివారి నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. వేకువ జామూనే సుప్రభాత సేవ చేపట్టి ప్రతిష్టామూర్తులను ఆరాధిస్తూ హారతి నివేదించారు. ఉత్సవమూర్తులను అభిషేకించి, తులసి పత్రాలతో అర్చించి దర్శన మూర్తులకు సువర్ణ పుష్పార్చన చేపట్టారు. మంటపంలో స్వామివారికి అష్టోత్తర పూజ, శ్రీసుదర్శన నారసింహ హోమం, విశ్వక్సేనారాధన ఆగమశాస్త్ర రీతిలో జరిపారు. సాయంత్రం వేళల్లో ఆలయ మంటపంలో సేవోత్సవం, రాత్రి అమ్మవార్లకు శయనోత్సవాన్ని నిర్వహించారు.
పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. పార్వతీదేవిని కొలుస్తూ శివాలయంలో అర్చకులు కుంకుమార్చననిర్వహించారు.
కొనసాగిన భక్తుల మొక్కులు..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగింది. కరోనా నేపథ్యంలో భక్తులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కరోనా దృష్ట్యా ఆలయ అధికారులు నిబంధనలు పాటించేందుకు అన్ని చర్యలు చేపట్టారు. భక్తులు భౌతికదూరం పాటించాలని తెలుపుతూ దేవస్థానం మైకుల ద్వారా గంటకోసారి అనౌన్స్మెంట్ చేశారు.
శ్రీవారి ఖజానాకు రూ.2,60,275 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ.2,60,275 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రచారశాఖ ద్వారా రూ.1,630, ప్రసాద విక్రయాలతో రూ.2,29,065, మినీబస్సుల ద్వారా రూ.1,380, వాహనపూజల ద్వారా రూ.9,200, కొబ్బరికాయలతో రూ.18,000, ఇతర విభాగాలతో రూ.1,000 తో కలిపి శ్రీవారి ఖజానాకు రూ.2,60,275 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
తాజావార్తలు
- డిజిటల్ వార్: గూగుల్+ఫేస్‌బుక్‌తో రిలయన్స్ జట్టు
- కంట్రోల్డ్ బ్లాస్టింగ్ మెథడ్‌తో భవనం కూల్చివేత
- ఏపీలో కొత్తగా 118 కరోనా కేసులు
- బార్బర్‌గా మారిన ప్రిన్సిపాల్.. విద్యార్థి హెయిర్‌కట్ సరిచేసిన వైనం
- మొదటి ప్రాధాన్యత ఓటు పల్లా రాజేశ్వర్‌రెడ్డికే
- సామాన్యుడి చెంతకు న్యాయవ్యవస్థను తేవాలి : వెంకయ్యనాయుడు
- కాయిర్ బోర్డ్ సభ్యుడిగా టిఫ్ జాయింట్ సెక్రటరీ గోపాల్‌రావు
- వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఏడుగురు నిందితులు అరెస్ట్
- 87 లక్షలు పెట్టి ఇల్లు కొని.. భారీ సొరంగం తవ్వి.. వెండి చోరీ
- ఒక్క ఉద్యోగం ఎక్కువిచ్చినా రాజీనామాకు సిద్ధం