రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
- రైతు వేదికల నిర్మాణ పనులకు శంకుస్థాపన
భువనగిరి : రైతు సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని అనాజీపురం, గౌస్‌నగర్, చందుపట్ల గ్రామాల్లో రైతు వేదికల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసి అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను రాజును చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారన్నారు.
రైతుబంధు, రుణమాఫీలను చేపట్టి దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రిగా పేరుపొందారన్నారు. రైతు వేదికల నిర్మాణాలతో రైతులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సాగు పద్ధతులపై చర్చించుకునే అవకాశాలు కల్పించారన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలను, సూచనలు పాటిస్తూ లాభసాటి వ్యవసాయాన్ని చేసి ఆర్థికంగా ఎదుగాలన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్క బతకాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, ఎంపీపీ నరాల నిర్మలవెంకటస్వామి, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, ఏడీఏ దేవ్‌సింగ్, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ అబ్బగాని వెంకట్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జనగాం పాండు,
రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ కంచి మల్లయ్య, చందుపట్ల పీఏసీఎస్ మాజీ చైర్మన్ బల్గూరి మధుసూదన్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఎడ్ల రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ అతికం లక్ష్మీనారాయణగౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు చిన్నం పాండు, ఈర్ల పుష్పమ్మకృష్ణ, ఎదునూరి ప్రేమలతామల్లేశం, ఎంపీటీసీ బొక్క కొండల్‌రెడ్డి, రాసాల మల్లేశ్ యాదవ్, గునుగుంట్ల కల్పనశ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు కాటిక జంగయ్య, కంకల కిష్టయ్య, కేశవరెడ్డి, జమ్ముల రమేశ్, సత్యనారాయణ పాల్గొన్నారు.
అన్నదాత శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం..
వలిగొండ: ఆరుగాలం కష్టపడి పనిచేస్తున్న అన్నదాతల శ్రేయస్సు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పులిగిల్ల, వెల్వర్తి, ఆరూరు, వేములకొండ గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల ఆర్థిక అభ్యున్నతికి రైతు బంధు పథకం, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని, రైతు వేదికల భవన నిర్మాణాలతో వ్యవసాయ అధికారులు స్థానికంగా ఉంటూ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి కన్వీనర్ కొల్పుల అమరేందర్, ఎంపీపీ నూతి రమేశ్‌రాజ్, జడ్పీటీసీ వాకిటి పద్మాఅనంతరెడ్డి, వైస్ ఎంపీపీ బాతరాజు ఉమాబాలనర్సింహ, రైతు బంధు సమితి మండల కన్వీనర్ పనుమటి మమత నరేందర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు చిట్టెడి జయమ్మ జనార్దన్‌రెడ్డి, పసల అన్నామేరి, జక్క వెంకట్‌రెడ్డి, బోడ లక్ష్మమ్మ బాలయ్య, పీఏసీఎస్ చైర్మన్లు సుర్కంటి వెంకట్‌రెడ్డి, చిట్టెడి వెంకట్రాంరెడ్డి, ఎంపీటీసీలు సామ రాంరెడ్డి, పసల జ్యోతి, ఎడవెల్లి సత్తమ్మ, బండారి ఎల్లయ్య, మదర్ డెయిరీ డైరెక్టర్ గూడూరు శ్రీధర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డేగల పాండరి, ప్రధాన కార్యదర్శి పైళ్ల మల్లారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, పంచాయతీరాజ్ డీఈ గిరిధర్, తహసీల్దార్ నాగలక్ష్మి, పీఆర్ఏఈ సుగుణాకర్‌రావు, ఏవో అంజనీదేవి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఉల్లిపాయ టీతో ఉపయోగాలేంటో తెలుసా
- మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు
- న్యాయమూర్తులపై దాడులు, ట్రోలింగ్ విచారకరం : కేంద్ర న్యాయశాఖ మంత్రి
- వాణీదేవిని గెలిపించాల్సిన బాధ్యత అందరిది : మహమూద్ అలీ
- ఆ డీల్ కుదరకపోతే 11 లక్షల ఉద్యోగాలు పోయినట్లే!
- డిజిటల్ వార్: గూగుల్+ఫేస్‌బుక్‌తో రిలయన్స్ జట్టు
- కంట్రోల్డ్ బ్లాస్టింగ్ మెథడ్‌తో భవనం కూల్చివేత
- ఏపీలో కొత్తగా 118 కరోనా కేసులు
- బార్బర్‌గా మారిన ప్రిన్సిపాల్.. విద్యార్థి హెయిర్‌కట్ సరిచేసిన వైనం
- మొదటి ప్రాధాన్యత ఓటు పల్లా రాజేశ్వర్‌రెడ్డికే