రైతుల ఐక్యత, కష్టానష్టాల చర్చకే ‘రైతు వేదికలు’

- అధునాతన వ్యవసాయానికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతర కృషి
- భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
భూదాన్‌పోచంపల్లి : రైతు శ్రేయస్సే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని జూలూరు, జలాల్పూర్ గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతు బీమా పథకాలకు శ్రీకారం చుట్టి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. అంతే కాకుండా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంతోపాటు తక్కువ ధరకు ఎరువులు కూడా అందజేస్తున్నదన్నారు. అనంతరం జూలూరులో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అమరేందర్, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్, జూలూరు సర్పంచ్ యాకరి రేణుకానర్సింగ్ రావు, ఎంపీటీసీ శంకరమ్మాకిష్టయ్య, జలాల్పూర్ సర్పంచ్ పర్నె రజితామల్లారెడ్డి, రైతు బంధు సమతి మండల కన్వీనర్ రావుల శేఖర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు అందెల లింగం యాదవ్, కందాడి భూపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, భువనగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ భిక్షపతి, పోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీశ్రీనివాస్, టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు శ్రీకాంత్ పాల్గొన్నారు.
రైతు వేదిక నిర్మాణాలకు శంకుస్థాపన..
బీబీనగర్ : తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పెద్ద పీట వేస్తున్నదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీబీనగర్ మండల కేంద్రంతో పాటు పడమటిసోమారం, వెంకిర్యాల, బ్రహ్మణపల్లి, రాయరావుపేట, గ్రామాల్లో నూతనంగా నిర్మించబోయే ‘రైతు వేదిక’ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించేందుకు ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నదన్నారు. రైతు వేదికల ద్వారా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, ఇతర విషయాలపై చర్చించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. రైతులు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు.
యంగ్ ఇండియా యాజమాన్యానికి అభినందనలు..
మండల కేంద్రంలో గజానికి దాదాపు రూ.20 వేలు పలుకుతున్న నేపథ్యంలో యంగ్‌ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెట్ అధినేత చెల్లా రాజేంద్రారెడ్డి తన వంతు సహాయంగా సాయి రసజ్న మెడోస్ వెంచర్లో 3వేల 2వందల గజాల స్థలాన్ని రైతు వేదిక నిర్మించేందుకు విరాళంగా అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా, మండల కో-ఆర్డినేటర్ అమరేందర్, బొక్క జైపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొలను లావణ్యాదేవేందర్‌రెడ్డి, ఏవో పద్మ, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీవాణి, వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, మండల కో-ఆప్షన్ సభ్యుడు అక్బర్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఊరికో పార్కు..
ఒకప్పుడు ఊరంటే పచ్చని చెట్లతో నందనవనాన్ని తలపించేలా ఉండేది. ప్రస్తుత కాలంలో ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా చెట్లను నరకడం వల్ల వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటుండటంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో హరితహారం కార్యక్రమాలతో పాటుగా ఊరికో పార్కు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే మండలంలోని రాయరావుపేట, నెమురగొముల గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న పల్లె ప్రకృతి వనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ప్రతి గ్రామంలో ఎకర స్థలం పార్కుకు కేటాయించి వివిధ రకాల పండ్లు, నీడనిచ్చే మొక్కలను పెంచనున్నట్లు ఆయన తెలిపారు.
తాజావార్తలు
- వామన్‌రావు హత్య కేసు సీబీఐకి ఇవ్వండి
- మహిళా దినోత్సవం నిర్వహణకు కమిటీ
- ఎన్ఏఈబీ సభ్యుడిగా శ్రీనివాస్‌రెడ్డి
- మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
- ‘వెల్చేరు’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
- సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా
- ఖనిజ నిధులతో అభివృద్ధి
- ముగిసిన జిల్లా స్థాయి రెజ్లింగ్ చాంపియన్‌షిప్
- బంగారం కొనుగోలుకు ఎస్బీఐ రుణ పరపతి ఇలా..
- వాస్తవాలు గ్రహించండి