శనివారం 24 అక్టోబర్ 2020
Yadadri - Jul 10, 2020 , 23:02:29

జిల్లాలో మోస్తరు వర్షం

 జిల్లాలో మోస్తరు వర్షం

భువనగిరి : జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు పలు మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. రాజాపేటలో 21.4 మిమీ, మోత్కూరులో 3 మిమీ, వలిగొండలో 1.6 మిమీ, గుండాలలో 1 మిమీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలో శుక్రవారం వర్షం రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. విత్తనాలు మొలకెత్తుతున్న దశలో వర్షం ఉపయోగపడుతుందని సంబురపడ్డారు. 


logo