గురువారం 26 నవంబర్ 2020
Yadadri - Jul 10, 2020 , 22:59:58

యాదాద్రిలో అమ్మవారికి ఊంజల్‌ సేవ

 యాదాద్రిలో అమ్మవారికి ఊంజల్‌ సేవ

ఆలేరు : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని బాలాలయం లో శుక్రవారం సాయంత్రం ఊంజల్‌ సేవను కోలాహలంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీ అమ్మవారికి విశేష పుష్పాలతో అలంకారం జరిపారు. బాలాలయం ముఖమండపంలో శ్రీవారికి పలు దఫాలుగా సువర్ణపుష్పార్చన జరిపించారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని  బాలాలయం ముఖ మంటపంలోని ఊయలలో శయనింపు చేయించారు. 

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయం లో నిత్యపూజలను అర్చకులు ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. ఉదయం సుప్రభాతం నిర్వహించిన అర్చకులు బాలాలయంలో ప్రతిష్ఠామూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేపట్టారు. మంటపంలోని శ్రీసుదర్శన నారసింహహోమం, కల్యాణ సేవ, నిత్యకల్యాణ వేడుకలు శాస్ర్తోక్తంగా జరిపారు. రాత్రి స్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేపట్టారు.వివిధ ప్రాంతా ల నుంచి వచ్చిన భక్తులు సామాజిక దూరం, మాస్కు లు ధరించి శ్రీస్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

శ్రీవారి ఖజానాకు రూ. 84,356 ఆదాయం 

శ్రీవారి ఖజానాకు రూ. 84,356 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రచార శాఖ ద్వారా రూ. 1,100, ప్రసాద విక్రయాలతో రూ. 70,855, మినీబస్సు ద్వారా రూ. 520, అన్నప్రసాదంతో రూ. 550, వాహన పూజల ద్వారా రూ. 5,100, కొబ్బరికాయలతో రూ. 5,880తో కలిపి శ్రీవారి ఖజానాకు రూ. 84,356 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.