శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 09, 2020 , 23:28:08

నిస్సార్‌కు కన్నీటి వీడ్కోలు

 నిస్సార్‌కు కన్నీటి వీడ్కోలు

గుండాల : ఆట, పాటలతో ప్రజలను చైతన్యపర్చిన రచయిత, కవి, గాయకుడు సుద్దాల నిస్సార్‌కు గురువారం కన్నీటి వీడ్కోలు పలికారు.  కరోనా వైరస్‌తో మృతి చెందిన నిస్సార్‌ అంత్యక్రియలు హైదరాబాద్‌లోనే జరిగాయి. గురువారం సాయంత్రం జగద్గిరిగుట్ట శ్రీనివాస్‌నగర్‌లో కుటుంబసభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. గాంధీ దవాఖాన నుంచి కుటుంబసభ్యు లు నేరుగా శ్మశానవాటికకు తీసుకెళ్లి వారి సంప్రదాయాల ప్రకారం ‘గాంధీ’ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలను నిర్వహించారు. ఆయన కుటుం బసభ్యులు, అభిమానులు దూరంగా ఉండి వీడ్కోలు పలికారు. గుండాల మండలం, సుద్దాల గ్రామంలో నిస్సార్‌ లేని లోటు తీరనిది అని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సార్‌ మరణంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. 


VIDEOS

logo