సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jul 09, 2020 , 22:55:14

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

  • జిల్లాలో 3293 మంది విద్యార్థులకు ప్రయోజనం  
  • నెలాఖరులో మెమోలు అందజేత 

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సెకండియర్‌లో ఫెయిలైన వారంతా పాస్‌గా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. దీంతో జిల్లాలో 3293 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నెలాఖరు లేదా ఆగస్టు మొదటివారంలో కాలేజీల్లో మెమోలు పొందవచ్చని సూచించింది. రీ వెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న వారి ఫలితాలను వారం పదిరోజుల్లో అందజేస్తామని విద్యాశాఖ వెల్లడించింది.   -భువనగిరి  

 భువనగిరి : కొవిడ్‌ - 19 నిబంధనల నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇంటర్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు అందరూ పాస్‌ అయినట్లుగా గురువారం ప్రకటించారు. దీంతో జిల్లాలోని 3,293 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. జిల్లా వ్యాప్తంగా 6,872 మంది విద్యార్థులు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరుకాగా, ఇందులో 5,512మంది జనరల్‌ విద్యార్ధులు,1,360మంది ఒకేషనల్‌ విద్యార్థులు  ఉన్నారు. ఇందులో జనరల్‌ విభాగంలో 2,857 మంది, ఒకేషనల్‌లో 722మంది ఉత్తీర్ణత సాధించారు.  జనరల్‌ విభాగంలో 2,655 మంది, ఒకేషనల్‌లో 638మంది విద్యార్థులు ఫెయిలయ్యా రు. కాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా 3,293మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

VIDEOS

logo