నిర్విరామం..పచ్చని యజ్ఞం

- జిల్లాలో ఉద్యమంలా సాగుతున్న హరితహారం
- రెండు నెలలకు 54లక్షల మొక్కలు సిద్ధం
- వివిధ శాఖల అధికారుల భాగస్వామ్యం
- ఇప్పటి వరకు నాటిన మొక్కలు 8.36 లక్షలు
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమసే ్తతెలంగాణ: జిల్లాలో హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతోంది. వర్షాలు సమృద్దిగా కురుస్తుండడంతో ఊరూరా ఉద్యమంలా సాగుతోంది. కలెక్టర్ అనితా రామచంద్రన్తోపాటు జిల్లా స్థాయి అధికారులు హరితహారం కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. ఆకుపచ్చ తెలంగాణ కోసం సబ్బండ వర్ణాలు సైతం ఇందులో పాల్గొని మొక్కలను నాటుతున్నారు. ఓ వైపు మొక్కలు నాటుతూనే.. మరోవైపు గుంతలు తీసే పనులు వేగంగా సాగుతున్నాయి. అడవిజాతి మొక్కలతో పాటు ఫలాలు ఇచ్చే మొక్కలను కూడా ఈసారి నాటుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ ప్రదేశాలు, ప్రధాన రహదారులకు ఇరువైపులా విరివిగా మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పొలం గట్ల వెంట తాటి వనాలను నాటే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఇప్పటి వరకు 8,36,970 మొక్కలు...
ఆరో విడత హరితహారంలో భారీ స్థాయిలో మొక్కలు నాటాలన్న సంకల్పంతో ప్రతి గ్రామంలోనూ నర్సరీను ఏర్పాటు చేసి 40 లక్షల మొక్కలను సిద్ధం చేశారు. అటవీశాఖ నర్సరీల్లో 14లక్షల మొక్కలు ఉన్నాయి. మున్సిపాలిటీల్లో నర్సరీలు లేనందున మున్సిపాలిటీల పరిధిలో నాటేందుకు 5 లక్షల మొక్కలను అటవీశాఖ కేటాయించింది. మొత్తం 11 శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శ్రమిస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 8,36,970 మొక్కలు నాటారు. డీఆర్డీవో శాఖ ఉపాధి హామీ పథకంలో 22.64లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యాన్ని పెట్టుకోగా ఇప్పటి వరకు 6.53లక్షల వరకు మొక్కలు నాటడం విశేషం.
తాజావార్తలు
- మహిళా పోలీస్ సేవలు భేష్
- అమ్మ లేనిదే ప్రపంచం లేదు.. ఆమె కీర్తి ప్రగతికి స్పూర్తి
- పోర్టర్లకు ఉచిత బస్సుపాసులు
- సెల్ఫీ విత్ హెల్మెట్ డ్రైవ్ షురూ..
- ప్రతి నీటి చుక్కను ఒడిసి పడదాం
- సంగీతంపై మక్కువతో..గళార్చన..
- తమిళనాడులో బీజేపీకి 20 సీట్లు
- రూపాయి ఖర్చు లేకుండా.. లక్ష మొక్కల సంరక్షణ
- సందేహాలు తీర్చేందుకే యూఎస్ఏ సెంటర్
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం